![]() |
![]() |
.webp)
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 త్వరలో మొదలు కాబోతోంది. దాని కోసం ఇప్పుడు ఇంటరెస్ట్, ఫ్యాషన్ ఉన్న సింగర్స్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. 14 నుంచి 30 ఏళ్ళ లోపు సింగర్స్ ని ఆడిషన్స్ కోసం పిలుస్తోంది ఆహా. తమ పేర్లను రిజిస్టర్ చేసుకోమంటూ ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఇక ఆహా ప్లాట్ఫారం మీద తెలుగు ఇండియన్ ఐడల్ 3 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. సీజన్ 1 2022 లో జరిగింది. ఫస్ట్ సీజన్ విన్నర్ గా వాగ్దేవి నిలిచింది. ఈ సీజన్ కి హోస్ట్ గా శ్రీరామచంద్ర వ్యవహరించగా జడ్జెస్ గా నిత్యా మీనన్, కార్తీక్, థమన్ ఉన్నారు.
.webp)
ఇక సీజన్ 2 విన్నర్ గా సౌజన్య భాగవతుల నిలిచింది. ఈ సీజన్ హోస్ట్ గా హేమచంద్ర వ్యవహరించగా జడ్జెస్ గా గీతా మాధురి, కార్తీక్, థమన్ ఉన్నారు. అలాగే సీజన్ 3 విన్నర్ గా నసీరుద్దీన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ కి హోస్ట్ గా శ్రీరామచంద్ర వ్యవహరించగా జడ్జెస్ గా గీతా మాధురి, కార్తీక్, థమన్ ఉన్నారు. ఇప్పుడు సీజన్ 4 కి సమయం వచ్చేసింది. "హలో హలో ఎవరున్నారు? స్టార్ డంలోకి రావడానికి ఒక్క అడుగే దూరం. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 వస్తోంది..మీరు సిద్ధంగా ఉన్నారా ?" అంటూ కాప్షన్ పెట్టింది ఆహా. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతోంది. సెలెక్షన్స్ ఎలా జరగబోతున్నాయి..హోస్ట్ ఎవరు, జడ్జెస్ ఎవరూ ఏ సెలెబ్రిటీ వచ్చి ఈ సీజన్ ని గ్రాండ్ లాంచ్ చేస్తారో చూడాలి.
![]() |
![]() |